Breaking News

🔴 తాజా వార్తలు
🔥 న్యాల్కల్ మండల తాజా వార్తలు | సంగారెడ్డి జిల్లా అప్డేట్స్ | గ్రామ వార్తలు | రాజకీయాలు | విద్య | Telangana Breaking News
🔴 Breaking News: న్యాల్కల్ తాజా వార్తలు | Ambedkar Jayanti 2026 | Telangana News Updates

📺 Latest News Video



▶️ Subscribe Channel

Monday, April 27, 2026

 

అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి | Nyalkal 24 News ePaper
Nyalkal 24 News
Truth Matters | న్యాల్కల్ 24 న్యూస్
పనే దైవం - సేవే పరమార్థం
Date: 26-04-2026
Printed On Page: 4
🔴 తాజా వార్తలు: అంబేద్కర్ విగ్రహావిష్కరణ | న్యాల్కల్ మండల తాజా వార్తలు | తెలంగాణ న్యూస్ అప్డేట్స్ | Nyalkal 24 News ePaper
అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి: మంత్రి వివేక్ వెంకటస్వామి
Ambedkar Statue Unveiling | రాంతీర్డ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా
📸 రాంతీర్డ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు

న్యాల్కల్, ఏప్రిల్ 26 (స్థానికం): ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడిచినప్పుడే ఆయనకు ఘన నివాళులర్పించినట్లు అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాంతీర్డ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆదివారం నాడు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ చైర్మన్ తన్వీర్లతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.

👉 ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

దళితులు విద్యావంతులు, ఆర్థికంగా ఎదిగినప్పుడే కుల వివక్ష పోతుందని, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు.

తన తండ్రి దివంగత వెంకటస్వామి (కాకా) సూచన మేరకు 35 ఏళ్ల క్రితమే విశాఖ రేకుల ఫ్యాక్టరీ నిర్మించి నిరుపేదలకు ఉపాధి కల్పించినట్లు గుర్తుచేశారు.

అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు.

ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కాకా అని కొనియాడారు.

అనంతరం గ్రామం నుంచి హద్నూర్ వరకు రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కోరగా, వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. విగ్రహం వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ఎంపీ హామీ ఇచ్చారు.

పాల్గొన్నవారు:
మాజీ మంత్రి చంద్రశేఖర్, గిరిధర్ రెడ్డి, తన్వీర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మహమ్మద్ యూనుస్, కండేం నర్సింలు, తిరుపతి రెడ్డి, కిరణ్ గౌడ్, నరేష్ గౌడ్, సర్పంచ్ రేవంత్ కుమార్ మరియు గ్రామస్తులు.

📍 శివ శంకర్ చాట్ బండార్ – న్యాల్కల్

Google Maps లో Location చూడండి

👉 Open Google Maps

Thursday, April 23, 2026

అత్నూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక | 200 మందితో భారీగా పార్టీ ప్రవేశం | న్యాల్కల్ న్యూస్

  అత్నూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక – 200 మందితో భారీగా పార్టీ ప్రవేశం

  ఇండిపెండెంట్ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక – నాయకుల సమక్షంలో కార్యక్రమం


 అత్నూర్, న్యాల్కల్ మండలం: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శెట్కార్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, డీసీసీ సభ్యుడు భాస్కర్ రెడ్డి సమక్షంలో ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అత్నూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షుడు రఫీయొద్దీన్ పటేల్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ కలీమ్ పటేల్, ఇస్మాయిల్ సాబ్, రహీమ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్‌తో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అత్నూర్ గ్రామ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్‌తో 
పాటు నాయకులు, కార్యకర్తలు సమూహంగా పాల్గొన్న దృశ్యం.
  గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారీగా పార్టీ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.

కొత్తగా పార్టీలో చేరిన వారిని నాయకులు అభినందించి, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

  సుమారు 200 మంది కార్యకర్తల చేరికతో అత్నూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది.

కార్యక్రమంలో రసూల్ పటేల్, ఎజాస్ పటేల్, జమీర్ పటేల్, సతీష్ పటేల్, అశోక్ పటేల్, మహమ్మద్ ముస్తఫ్ఫా సాబ్, అబ్దుల్ రహిమాన్, మాజీద్, శివాజీ గౌడ్, వీర రెడ్డి, వాజీద్ పటేల్, జహంగీర్ సాబ్, వెంకట్ రెడ్డి, ఖయ్యుమ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


📍 శివ శంకర్ చాట్ బండార్ - న్యాల్కల్

👉 Google Maps లో చూడండి

📍 Nyalkal Mandal | Sangareddy District
✍️ Reporter: Sangameshwar Reddy

Friday, April 17, 2026

చనిగేపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం | ₹20 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణం

న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లిలో సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో ₹20 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

 చనిగేపల్లి అభివృద్ధి పనులు న్యాల్కల్ జేసీబీ రోడ్డు పనులు

చనిగేపల్లి, న్యాల్కల్ మండలం:

సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లిలో గ్రామ అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జేసీబీ సహాయంతో పనులను ప్రారంభించారు. సుమారు ₹20 లక్షల (₹20,00,000) వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను మెరుగుపరచనున్నాయి.సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గారికి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


— సంగమేశ్వర్ రెడ్డి (మీడియా రిపోర్టర్)


Monday, April 13, 2026

న్యాల్కల్ లొ టాప్ భావన (BiPC) – 915 మార్కులు

న్యాల్కల్, హద్నూర్ ఇంటర్ ఫలితాలు 2026: విద్యార్థుల ప్రతిభ మెరుగు – 78% & 63% ఉత్తీర్ణత

న్యాల్కల్: తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో న్యాల్కల్ మరియు హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభను చాటారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల్లో పలువురు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.

915 మార్కులతో మెరిసిన భావన (BiPC)

న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 100 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 37% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 118 మంది విద్యార్థుల్లో 92 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 78% ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపల్ తెలిపారు.

🎓 టాపర్స్ వివరాలు

  • భావన (BiPC)915 మార్కులు
  • దివ్యాంక (BiPC)911 మార్కులు
  • శశి ప్రియ (CEC)673 మార్కులు
  • మహేశ్వరి (CEC)632 మార్కులు

హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరంలో 64 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 40 మంది (63%) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 84 మంది విద్యార్థుల్లో 36 మంది (43%) ఉత్తీర్ణత సాధించారు.

🏆 హద్నూర్ టాపర్స్

  • ముస్కాన్ ఫాతిమా (BiPC)872 మార్కులు
  • హనీఫా (MPC)450 మార్కులు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధించారని తెలిపారు.


📰 రిపోర్టర్: సంగమేశ్వర్ రెడ్డి
📍 న్యాల్కల్
📅 తేదీ: 13 ఏప్రిల్ 2026

Nyalkal News by Sangameshwar Reddy

Sangareddy District News Reporter Sangameshwar Reddy

#SangameshwarReddy #Nyalkal #Sangareddy #TelanganaNews


Sunday, April 12, 2026

న్యాల్కల్ ఇంటర్ ఫలితాల్లో 915 మార్కులతో ప్రతిభ కనబరిచిన భావన

 హద్నూర్లో 86.83% ఉత్తీర్ణత.. విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

        న్యాల్కల్ | సంగారెడ్డి జిల్లా | తెలంగాణ


న్యాల్కల్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో న్యాల్కల్, హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 366 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 208 మంది ఉత్తీర్ణత సాధించి 86.83% ఫలితాన్ని నమోదు చేశారు.

హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 148 మంది పరీక్షలు రాయగా, 76 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 51% ఉత్తీర్ణత నమోదైంది.

న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 218 మంది పరీక్షలు రాయగా, 128 మంది ఉత్తీర్ణత సాధించి 58.75% ఫలితాన్ని నమోదు చేశారు.




భావన – న్యాల్కల్ జూనియర్ కళాశాల BIPC విద్యార్థిని | 915 మార్కులు

వ్యక్తిగతంగా హద్నూర్ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిని హనీఫా 450 మార్కులు సాధించగా, న్యాల్కల్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థిని భావన 915 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.


🔗 ఫలితాలు చెక్ చేయండి

👉 ఇక్కడ క్లిక్ చేయండి


📊 ముఖ్య సమాచారం

  • మొత్తం విద్యార్థులు: 366
  • ఉత్తీర్ణులు: 208
  • మొత్తం ఉత్తీర్ణత: 86.83%
  • హద్నూర్: 51%
  • న్యాల్కల్: 58.75%
  • లోకల్ రిపోర్టర్ సంగమేశ్వర్ రెడ్డి ✍️

🔎 Keywords: Hadnur Inter Results 2026, Nyalakal News, Telangana Education News

బెంగాల్ ఎన్నికల ట్రెండ్‌ల ప్రభావం: న్యాల్కల్‌లో బీజేపీ సంబరాలు, కార్యకర్తల వేడుకలు

బెంగాల్ ట్రెండ్‌లతో న్యాల్కల్‌లో బీజేపీ సంబరాలు న్యాల్కల్, మే 4 2026 ఎన్నికల ప్రాథమిక ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో భారతీయ...