Breaking News

🔴 తాజా వార్తలు
🔥 న్యాల్కల్ మండల తాజా వార్తలు | సంగారెడ్డి జిల్లా అప్డేట్స్ | గ్రామ వార్తలు | రాజకీయాలు | విద్య | Telangana Breaking News
🔴 Breaking News: న్యాల్కల్ తాజా వార్తలు | Ambedkar Jayanti 2026 | Telangana News Updates

📺 Latest News Video



▶️ Subscribe Channel

Friday, March 20, 2026

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో రంజాన్ వేడుకలు.. బీఆర్‌ఎస్ నాయకులతో ఘనంగా సంబరాలు

   సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు

              న్యాల్కల్‌లో రంజాన్ సంబరాల దృశ్యం

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కలిసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలోని ముస్లిం సోదరులతో పాటు ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రంజాన్ పండుగ శాంతి, సహనం, సోదరభావానికి ప్రతీక అని నాయకులు పేర్కొన్నారు. మత సామరస్యానికి నిదర్శనంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడం విశేషం. గ్రామంలో ఐక్యత వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు:
గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, స్వప్న భాస్కర్, బొల్లి కాశప్ప, ఇలియాస్ ఖాన్, ఇమ్రాన్, సున్నాఫ్ సత్యనారాయణ, గొల్ల రాములు, వార్డ్ మెంబర్లు తదితరులు.

రిపోర్టర్: సంగమేశ్వర్ రెడ్డి

న్యాల్కల్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహణ | Panchangam 2026 | Telangana Village News”

న్యాల్కల్‌లో పంచాంగ శ్రవణం.. రైతులకు అనుకూల వర్షాల సూచన 

న్యాల్కల్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహణ

న్యాల్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిష్కుడు జోషి గిరీష్ మహారాజ్ ఈ సంవత్సర గ్రహాల సంచారం గురించి వివరించారు.ఆయన మాట్లాడుతూ పలు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయని తెలిపారు. రైతులకు అనుకూల వర్షాలు కురిసి పంటలు బాగా పండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.ఉగాది పచ్చడిని సేవించి కుటుంబ సమేతంగా నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాలని సూచించారు.

“న్యాల్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం”

 శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం

ఉగాది సందర్భంగా ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు.

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే న్యాల్కల్ బస్టాండ్ ప్రాంగణంలోని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.

#Nyalakal #Ugadi2026 #TelanganaNews #VillageNews #Sangareddy #Panchangam
అందరికీ ఉగాది శుభాకాంక్షలు


Saturday, March 14, 2026

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

 న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భారత్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు...

         చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భారత్ గ్యాస్ (స్వరాజ్) సరఫరాపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆరోపించారు.



             అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు...

ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని బస్టాండ్ ప్రాంగణంలో రెండు నుంచి మూడు గంటల పాటు నిలిపివేశారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలిసిన అద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వినియోగదారులతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పారు. గ్యాస్ సరఫరా వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.అనంతరం గ్యాస్ సరఫరా వాహనం యథావిధిగా పంపిణీ కొనసాగించగా వినియోగదారులు సిలిండర్లను స్వీకరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రిపోర్టర్ : సంగమేశ్వర్ రెడ్డి న్యాల్కల్ 


Monday, March 9, 2026

Nyalakal News – Latest News from Nyalakal Village Sangareddy Telangana

న్యాల్కల్: ప్రమాదాలకు అడ్డ.. స్వచ్ఛందంగా బావి మూసివేత

న్యాల్కల్‌లో హోలీ సంబరాలు.. రంగుల్లో మునిగిన చిన్నారులు

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో హోలీ పండుగను గ్రామస్తులు ఆనందంగా జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో రంగుల సందడి కనిపించింది. ముఖ్యంగా చిన్నారులు గులాల్ రంగులతో ఆటలు ఆడుతూ హోలీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోవడం ఆకట్టుకుంది. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా
Little Star Arjun Reddy from Nyalakal Village


Holi festival celebrations children playing colors in Nyalakal village Sangareddy Telangana


Children celebrating Holi festival in Nyalakal village Sangareddy district Telangana India


Kids playing Holi colors festival in Nyalakal village Telangana India


Nyalakal News, Holi Festival, Sangareddy, Telangana News

బెంగాల్ ఎన్నికల ట్రెండ్‌ల ప్రభావం: న్యాల్కల్‌లో బీజేపీ సంబరాలు, కార్యకర్తల వేడుకలు

బెంగాల్ ట్రెండ్‌లతో న్యాల్కల్‌లో బీజేపీ సంబరాలు న్యాల్కల్, మే 4 2026 ఎన్నికల ప్రాథమిక ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో భారతీయ...