Breaking News

🔴 తాజా వార్తలు
🔥 న్యాల్కల్ మండల తాజా వార్తలు | సంగారెడ్డి జిల్లా అప్డేట్స్ | గ్రామ వార్తలు | రాజకీయాలు | విద్య | Telangana Breaking News
🔴 Breaking News: న్యాల్కల్ తాజా వార్తలు | Ambedkar Jayanti 2026 | Telangana News Updates

📺 Latest News Video



▶️ Subscribe Channel

Monday, March 9, 2026

Nyalakal News – Latest News from Nyalakal Village Sangareddy Telangana

న్యాల్కల్: ప్రమాదాలకు అడ్డ.. స్వచ్ఛందంగా బావి మూసివేత

మునిగి—న్యాల్కల్ రహదారిపై ప్రమాదకరంగా మారిన బావికి ఎట్టకేలకు మోక్షం లభించింది. టర్నింగ్ పాయింట్ వద్ద ఉన్న ఈ బావి కారణంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన బావి యజమాని, సామాజిక బాధ్యతతో స్పందించి స్వయంగా ఖర్చు పెట్టుకుని బావిపై గట్టి ఇనుప జాలిని ఏర్పాటు చేసి మూసివేశారు. యజమాని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా


 న్యాల్కల్ సర్పంచ్ జ్యోతిలక్ష్మి–ప్రవీణ్ కుమార్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు. తమ హక్కులు, బాధ్యతలను గుర్తించి సమాజంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మహిళల అభివృద్ధి ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు
న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా


న్యాల్కల్‌లో భారత్ గ్యాస్ సిలిండర్ డెలివరీలో అదనపు వసూళ్లు?


సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భారత్ గ్యాస్ సిలిండర్ డెలివరీలో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొబైల్ మెసేజ్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర ₹984.50గా చూపించినప్పటికీ, డెలివరీ సమయంలో ₹1040 వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఒక్కో సిలిండర్‌పై ₹50–₹60 వరకు అదనంగా తీసుకుంటున్నారని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

No comments:

Post a Comment

బెంగాల్ ఎన్నికల ట్రెండ్‌ల ప్రభావం: న్యాల్కల్‌లో బీజేపీ సంబరాలు, కార్యకర్తల వేడుకలు

బెంగాల్ ట్రెండ్‌లతో న్యాల్కల్‌లో బీజేపీ సంబరాలు న్యాల్కల్, మే 4 2026 ఎన్నికల ప్రాథమిక ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో భారతీయ...